కార్ల షోరూం యజమానినంటూ బ్యాంకుకు మస్కా.. రూ.8.2 లక్షలకు టోకరా!

28-08-2019 Wed 12:35 | Telangana
  • బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదుతో రంగంలోకి సైబరాబాద్ పోలీసులు
  • ఉత్తరప్రదేశ్‌ ముఠా పనిగా గుర్తించి వల
  • నలుగురిని పట్టుకుని రూ.3 లక్షల నగదు, కారు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం
ఓ కార్ల డీలర్‌ పేరు చెప్పి ఏకంగా బ్యాంకుకే బురిడీ కొట్టిన నలుగురు సైబర్‌ క్రైం నేరగాళ్లు పాపం పండి పోలీసుల వలకు చిక్కారు. వీరి వద్ద నుంచి 3 లక్షల రూపాయల నగదు, ఒక కారు, ఏడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రముఖ కార్ల షోరూంకు ఈనెల 9న  ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్‌ ఫోన్‌ చేశాడు.

ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన సేల్స్‌ సిబ్బందికి తనను తాను పెద్ద సంస్థకు యజమానిగా పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థ అవసరార్థం పెద్దమొత్తంలో కార్లు కొంటున్నామని నమ్మబలికి, తమకు కొన్ని వివరాలు కావాలని అడిగాడు. పెద్ద బిజినెస్‌ లభిస్తోందన్న ఆశతో సేల్స్‌మేన్‌ సంస్థకు చెందిన మొత్తం వివరాలు చెప్పేశాడు. పనిలో పనిగా తమ సంస్థ బ్యాంకు అకౌంట్‌ వివరాలు కూడా తెలిపాడు. దీంతో ఓ ఖాళీ చెక్‌ పంపించాల్సింది కోరి ఫోన్‌ పెట్టేశాడు.

పెద్ద బిజినెస్‌ తలుపుతట్టిందని భావించిన సేల్స్‌మన్‌ అతను చెప్పినట్టే ఖాళీ చెక్కును వాట్సాప్‌లో పంపాడు. ఈ చెక్‌ అందిన తర్వాత సంస్థ అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌కు ఫోన్‌ చేశాడు. బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌తో తనను తాను కార్ల షోరూం యజమానిగా పరిచయం చేసుకున్నాడు. కాసేపు అవీ ఇవీ మాట్లాడి  పెద్ద మొత్తంలో మీ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అప్పటికే షోరూం నుంచి భారీగా లావాదేవీలు జరుగుతుండడంతో అతను చెప్పింది నిజమేనని నమ్మిన సీనియర్‌ మేనేజర్‌ పెద్దమొత్తంలో డిపాజిట్‌ వస్తుందని ఆశపడ్డాడు.

మేనేజర్‌ తన మాయలో పడ్డాడని గుర్తించి సైబర్‌ కేటుగాడు తమ సంస్థ నుంచి అర్జంటుగా మరో సంస్థకు 8.2 లక్షలు బదిలీ చేయాల్సి ఉందని, షోరూం సిబ్బందితో చెక్కు పంపిస్తున్నానని, వీలైనంత వేగంగా డబ్బు సదరు అకౌంట్‌కు బదిలీ చేయాలని కోరాడు. భారీ మొత్తంలో డిపాజిట్‌ వస్తుందన్న ఆశలో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌ నిజానిజాలు నిర్థారించుకోకుండా అతను చెప్పిన అకౌంట్‌కు డబ్బు బదిలీ చేసేశాడు.

కానీ ఎప్పటికీ షోరూం సిబ్బంది చెక్కు పట్టుకుని రాకపోవడంతో అనుమానం వచ్చి షోరూంకు ఫోన్‌ చేసి ఆరాతీయగా అసలు మోసం బయటపడింది. దీంతో మరునాడు అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఖాతా వివరాల ద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాపని అని గుర్తించి వలవేశారు.

ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్‌ (30), ఢిల్లీ మయూర్‌ విహార్‌ వాసి లోకేష్‌ తోమార్‌ (33), గ్రేటర్‌ నోయిడాకు చెందిన మోహిత్‌ కుమార్‌(28), మీరట్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌(35)లను అరెస్టు చేశారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో వీరు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
cyber crimeHyderabadgachibouli8.2 laks cheating

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more